
ఈ మధ్యకాలంలో బ్రహ్మనందం తర్వత అంతాలా క్రేజ్ తెచ్చుకున్న నటుడు పృద్వి. మెన్నటి లౌక్యం నుండి రీసెంట్ గా వచ్చిన జక్కన్న వరకూ వైవిధ్యమైన స్పూఫ్ లతో ఆకట్టుకున్నారు. ప్రభాస్ బహుబలి సినిమాను దాదాపు నాలుగు సినిమాలలో స్ఫూఫ్ గా చేయగా ...శ్రీమంతుడు కూడా అదే స్థాయిలో స్పూఫ్ లకు ఎగబాకింది. కాకపోతే ఇందులో విశేషం ఎమిటంటే, ఈ సినిమాల స్పుఫ్ లలో ఎక్కువగా నటించి మెప్పించింది మాత్రం ధర్టి ఇయిర్స్ ఇండస్ట్రీ పృద్వియే కావటం విశేషం. బాహుబలి లో శివలింగాన్ని ఎత్తిన సీన్ ను అనుకరించడంలో తనకు సాటి ఎవరు లేగని నిరుపించిన ఫృధ్వి.... భలే మంచి రోజు సినిమాలో కూడా పోలీస్ సినిమాల్లో డైలాగులు వరస పెట్టి చెప్పాడు. అంతేకాదు... మహేష్ శ్రీమంతుడు సునిమాలో డైలాగ్స్ అచ్చంగా దించి ఆడియన్స్ చేత ఈలలు వేయించాడు దియోటర్స్ లో. శంకరాభరణం సినిమాలో కూడా శ్రీమంతుడు డైలాగు చెప్పి విజిల్స్ వేయించాడు. సౌఖ్యం సినిమాలో అయితే పూర్తిగా స్ఫూఫ్ ల మీదే నడిపే ప్రయత్నం చేసారు. ఇదే రీతిలో సప్తగిరి, షకలక శంకర్ కూడా వారి స్థాయిలో స్ఫూఫ్ లు చేసి వారు మెప్పించారు.
No comments