కోహ్లీ-రహానే అదుర్స్: సచిన్-లక్ష్మణ్ భాగస్వామ్య రికార్డ్ బద్దలు


ఇండోర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేలు అదరగొట్టేశారు. దీంతో పలు రికార్డులు బద్దలైపోయాయి.  బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో నాలుగో వికెట్ భాగస్వామ్యానికి సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లు నెలకొల్పిన భాగస్వామ్య రికార్డును కోహ్లీ-రహానేల జోడీ బద్దలు కొట్టింది జట్టు స్కోరు 453 పరుగులకు చేరగానే ఈ రికార్డు బద్దలైంది. 2004 సంవత్సరంలో జనవరి 2 నుంచి 6 మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్ల పతనం తరువాత ఫోర్త్ డౌన్‌గా వచ్చిన సచిన్ 241, ఆపై ఫిఫ్త్ డౌన్ గా వచ్చిన లక్ష్మణ్ 178 పరుగులు చేసి 353 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 705 పరుగులు చేసింది. మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రస్తుతం ఇండోర్ లో జరుగుతున్న మ్యాచ్ లో నాలుగో వికెట్ భాగస్వామ్యానికి కోహ్లీ, రహానేలు ఆ రికార్డును బద్దలు కొట్టారు. కోహ్లీ 206, రహానే 161 పరుగులకు చేరగానే, వీరిద్దరి భాగస్వామ్యం 353 పరుగులను దాటింది. దీంతో మైదానంలో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. కాగా, కోహ్లీ 211, రహానే 188 పరుగులతో అదరగొట్టేశారు. దీంతో 557 పరుగుల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఆటగాడు కోహ్లీ

కోహ్లీ 206, రహానే 161 పరుగులకు చేరగానే, వీరిద్దరి భాగస్వామ్యం 353 పరుగులను దాటింది. దీంతో మైదానంలో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. కాగా, కోహ్లీ 211, రహానే 188 పరుగులతో అదరగొట్టేశారు. దీంతో 557 పరుగుల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఆటగాడు కోహ్లీ టెస్టుల్లో రెండు డబుల్‌ సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అంతే కాదు.. అతను ఈ డబుల్‌ సెంచరీలను వరుస సిరీస్‌లలో సాధించాడు. టైగర్‌ పటౌడీ, సచిన్‌ తెందుల్కర్‌, మహేంద్రసింగ్‌ ధోని మాత్రమే డబుల్‌ సెంచరీ చేసిన భారత కెప్టెన్లు. సచిన్‌ (2004, 2010), కాంబ్లి (1993), ద్రవిడ్‌ (2003), సెహ్వాగ్‌ (2008)ల తర్వాత ఒకే ఏడాది రెండు డబుల్‌ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌ జాబితాలోనూ కోహ్లి చేరాడు. ప్రస్తుత స్కోరే (211) కోహ్లికి టెస్టుల్లో అత్యుత్తమం. ఈ జులైలోనే అతను వెస్టిండీస్‌పై సరిగ్గా 200 పరుగులు చేశాడు. చంపేశాడు ఇది ఇలా ఉండగా, కోహ్లీ ఇన్నింగ్స్‌పై కివీస్ కోచ్ మైక్ హెసన్ స్పందిస్తూ.. 'భారత్‌ గొప్ప నాణ్యతతో బ్యాటింగ్‌ చేసింది. మేం చాలా ప్రణాళికలు రచించాం. అమలు చేశాం. అయినా మా వల్ల కాలేదు. కోహ్లి మమ్మల్ని సున్నితంగా చంపేశాడు. అతను ఒకట్రెండు పరుగులతోనే 120 స్కోరు చేశాడు' అని ప్రశంసించాడు. రికార్డులు 1

టెస్టుల్లో రెండు డబుల్‌ సెంచ రీలు సాధించిన తొలి భారత కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. గతంలో పటౌడీ, గవాస్క ర్‌, సచిన్‌, ధోనీ కెప్టెన్లుగా ఒక్కో డబుల్‌ సెంచరీ సాధించారు. 5 ఒక ఏడాదిలో రెండు డబుల్‌ సెంచరీలు సాధించిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌ కోహ్లీ. ఈ క్రమంలో సచిన్‌ (2004, 2010), వినోద్‌ కాంబ్లీ (1993), రాహుల్‌ ద్రావిడ్‌ (2003), సెహ్వాగ్‌ (2008) సరసన చేరాడు. 4 న్యూజిలాండ్‌పై ద్విశతకం సాధించిన నాలుగో కెప్టెన్‌ కోహ్లీ. సచిన్‌ (217), అలన్‌ బోర్డర్‌ (205), హనీఫ్‌ మహ్మద్‌ (203 నాటౌట్‌) కూడా కెప్టెన్లుగా కివీస్‌పై డబుల్‌ సెంచరీలు సాధించారు. 365 కోహ్లీ-రహానె భారత తరఫున నాలుగో వికెట్‌కు అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో లక్ష్మణ్‌-సచిన్‌ పేరిట ఉన్న 353 పరుగుల రికార్డు తెరమరుగైంది. 672 కోహ్లీ-రహానె ఈ మ్యాచ్‌లో ఎదుర్కొన్న బంతుల సంఖ్య ఇది. టెస్టుల్లో ఒక భారత జోడీ ఇన్ని బాల్స్‌ ఎదుర్కోవడం ఇదే తొలిసారి. 2013లో ఆస్ర్టేలియాతో మ్యాచ్‌లో పుజారా-విజయ్‌ 658 బంతులు ఎదుర్కొన్నారు.567 ఈ ఏడాది ఏడు టెస్టులాడిన రహానె 81.00 సగటుతో 567 రన్స్‌ సాధించాడు. అందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీన్నాయి. 188 టెస్టుల్లో రహానెకు ఇదే అత్యుత్తమ స్కోరు. ఈ క్రమంలో ఆస్ర్టేలియాపై సాధించిన 147 రన్స్‌ స్కోరును అధిగమించాడు.


No comments