సొంతపార్టీ నేతలపై చర్యలకు టీఆర్ఎస్ సిద్ధం!

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం వ్యవహారంలో.. సొంతపార్టీ నేతలపై చర్యలతోనే ప్రక్షాలన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నయీం వ్యవహారంతో సంబంధమున్న నేతలపై చర్యలకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. నయీం కేసు విచారణ నివేదిక సీఎం కేసీఆర్ చేతికి చేరింది. ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, 21 మంది పోలీసులు నయీంతో అంటకాకాగారని అధికారులు నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా నయీం వ్యవహారాన్ని ఇన్‌ఫార్మర్, గ్యాంగ్ స్టర్ కోణాల్లో నివేదిక ప్రస్తావించినట్లు సమాచారం. ఇన్ ఫార్మర్ వ్యవహారంలో సంబంధమున్నవారికి ఊరటనిచ్చి.. గ్యాంగ్‌స్టర్ నయీంను వాడుకున్న వారిపై వేటు వేయడానికి రంగం సిద్ధమైంది. మొదట రాజకీయ నాయకుల నుంచే చర్యలు మొదలుకానున్నాయి. ఈ మేరకు గణేష్ నిమజ్జనం తరువాత కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నట్లు సమాచారం.

No comments