
సాంసంగ్, ఎల్జీ సంస్థల మధ్య ఒకరి ఉద్యోగులను ఒకరు తీసుకోకూడదనే ఒప్పందం ఉందని పిటిషనర్ ఫ్రాస్ట్ వాదిస్తున్నారు. ఇలా నిబంధనల ఉల్లంఘన ద్వారా ఉద్యోగుల జీతాలను కిందికి తెస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. 2013 లో లింక్డ్ఇన్ ద్వారా శాంసంగ్ లో ఉద్యోగం కోసం తనను సంప్రదించారని, వెంటనే తాను పొరపాటు చేశానని, శాంసంగ్, ఎల్జీ మధ్య ఒకరి ఉద్యోగాలను ఒకరు నియమించుకోకూడదనే ఒప్పందని ఉందని చెప్పారని దావాలో తెలిపారు. ఇది అక్రమమని..క్షమించమని రిక్రూటర్ తెలిపాడనేది ఫ్రాస్ట్ వాదన.
అయితే ఈ ఆరోపణలను ఎల్జీ ప్రతినిధి ఖండించారు. అలాంటి ఒప్పందమేమీ తమ మధ్య లేదన్నారు. ఈ ఆరోపణల్లో బలం లేదని వాదించగా, శాంసంగ్ వ్యాఖ్యానించడానికి నిరాకరిచింది.మరోవైపు ఇలాంటి అంతర్గత ఒప్పందాలు పోటీ తత్వానికి విరుద్ధమని ఫ్రాస్ట్ లాయర్ జోసెఫ్ సవేరీ వ్యాఖ్యానించారు. ప్రతిభ, సామర్ధ్యం ఆధారంగా ఉద్యోగాలు పొందడం ఉద్యోగుల ప్రాథమి హక్కు అన్నారు. కాగా టెక్ దిగ్గజాలు ఆపిల్, గూగుల్ మధ్య నెలకొన్న ఇలాంటి వివాదాన్ని గత ఏడాది 415 మిలియన్ డాలర్లకు సెటిల్ చేసుకున్న సంగతి తెలిసిందే.
No comments