ఆర్ కాం జియో కి షాకిస్తుందా?

ముంబై: ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఎయిర్ సెల్ , ఆర్ కాం విలీనానికి  రంగం సిధ్దమైంది.  అనిల్‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ తో మరో టెలీకాం సంస్థ ఎయిర్‌సెల్‌  సంస్థ విలీనంపై ఈ నెలలోనే అధికారికంగా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.   ఇండియాలో వినియోగదారుల పరంగా టాప్-3 టెలికం సంస్థగా ఆవిర్భవించాలన్న కోరికతో ఉన్న అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఆ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. బుధవారం జరగబోయే ఆర్ కాం బోర్డ్  సమావేశం అనంతరం  ఈ డీల్ పై అధికారిక ప్రకటన వెలువడవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సుమారు రూ. 14వేల కోట్ల వాటాల జారీ విధానం ద్వారా ఈ ఒప్పందం   ఖరారు కానుంది. దీని  ద్వారా 196  మిలియన్ల ఖాతాదారులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న సమాచారం.
ఒప్పందం ప్రకారం ఇరు సంస్థలు  ఒక  కొత్త బ్రాండ్ నేమ్ తో   పనిచేయన్నాయి.  ఎయిర్ సెల్,ఆర్ కాం సమాన భాగస్వామ్యంతో ఈ కొత్త సంస్థ పనిచేయనుంది.  చెరి 580 మిలియన్ డాలర్ల పెట్టబడులతో 7600కోట్ల  ఈక్విటీ పూల్ ను సాధించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.  కొత్త కంపెనీ   స్పెక్ట్రం  లైసెన్స్ 800, 900,1800, 2100, 2300 ఎంహెచ్ జె బాండ్ విడ్త్ తో  ఉంటుందని  అంచనా.   అయితే ఈ వార్తలను ధృవీకరించడానికి  ఇరు సంస్థలు నిరాకరించాయి.
కాగా  ఉచిత సేవలు, ఉచితరోమింగ్ అంటూ సంచలనంగా మార్కెట్ లోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియోకి  పోటీగా ఆర్ కాం తాజాగా 40రూపాయలకే ఫుల్ టాక్ టైం, 1 జీబీ డాటా ఉచితంగా అందించే ఆఫర్  ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశంలోనే మూడవ అతిపెద్ద టెలికమ్యూనికేషన్ సంస్థ ఏర్పాటుపై కన్నేసిన  అనిల్ ఆధ్వర్యంలోని ఆర్ కాం సోదరుడు ముకేష్ సొంతమైన జియోకి షాకిస్తుందా అనే అభిప్రాయం మార్కెట్ లో నెలకొంది.

No comments