అంకెల్లో గారడీ కోసం..నటిస్తున్నారు..దోచేస్తున్నారు!

అంకెల్లో గారడీ కోసం..నటిస్తున్నారు..దోచేస్తున్నారు
ఇండియన్ ఎకానమీ -పేరుతో గ్రామీణ విధ్వంసం
స్రుష్టిస్తున్నారు రైతు కుటుంబాల నుండి వచ్చిన వెంకయ్య చంద్రబాబు కాదని చెప్పగలరా? 
రెండు దశాబ్దాలుగా ... ఇండియన్ ఎకానమీ, కరెంటు ఖాతా లోటు పూడ్చుకోడం ( ఎగుమతులు - దిగుమతుల వ్యత్యాసం తగ్గించుకోడం), విదేశీ కరెన్సీ నిల్వలను మరింతగా పెంచుకోడం చుట్టూనే తిరుగుతోంది. 91లో వచ్చిన పే క్రైసిస్ మూలంగా...దారి మార్చుకున్న ఇండియన్ ఎకానమీ, ఆ దారిలో అనేక తప్పులు చేసింది. 
విదేశీ కరెన్సీ నిల్వలను పెంచుకోడం కోసం...విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది. దేశంలో ఉత్పత్తిని పెంచడం కోసం...కార్పొరేట్, ప్రైవేట్ వర్గాలకు పూర్తిగా ద్వారాలు తెరిచింది. దీంతో అంకెల్లో వృద్ధి సాధించింది...విదేశీ కరెన్సీ నిల్వలూ పెరిగాయి, కానీ గ్రామాలు రోడ్డున పడ్డాయి. గ్రామీణ కుటీర పరిశ్రమలు, కులవృత్తులు ఈ దెబ్బతో పూర్తిగా నశించిపోయాయి. గ్రామాలను పణంగా పెట్టి ... నగరాలు, మహానగరాల్లో సంపదను వృద్ధి చేసిన ప్రభుత్వాలు, ఇలాంటి సమయంలో తాము చేయాల్సిన పనిని మర్చిపోయాయి. గ్రామాల్లో వ్యవసాయాధారిత పరిశ్రమలను, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించి, వారికి ఆల్టర్నేటివ్ ఉపాధిని చూపించడంలో విఫలమయ్యాయి. సంపద వికేంద్రీకరణ జరగకపోగా...నల్లధనం, అవినీతి, లంచగొండితనం రూపంలో ఉన్న సంపద కూడా...లెక్కలో లేకుండా పోయింది. దేశంలో ఇప్పటికీ 65శాతం నివశిస్తున్న గ్రామాలను విధ్వంసమైతే చేసింది కానీ...వాటి పునర్నిర్మాణం వైపు ఇండియన ఎకానమీ దృష్టి పెట్టలేదు. అందుకే గ్రామాల్లోని రైతుల, వృత్తిదారుల ఆత్మహత్యలు.
గ్రామాలను, గ్రామీణ ప్రజల జీవితాలను విధ్వంసం చేసి...సంపద సృష్టించుకున్న ప్రభుత్వాలు,,, ఆ సంపదలో పావలా వంతును సబ్సిడీ రూపంలో తిరిగి వారికివ్వడానికి వెయ్యి వంకలు పెడుతున్నాయి. ఇదీ మన ఎకానమీ...ఇవీ మన ప్రభుత్వాలు
..

No comments