జాతీయ సెలక్టర్లకు బీసీసీఐ ఆహ్వానం
ముంబయి: సీనియర్, జూనియర్, మహిళల విభాగంలో జాతీయ సెలక్టర్ల కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. భారత జట్టు తరఫున టెస్టు, వన్డే మ్యాచుల్లో గాని భారత్‌లో 50కి పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లను ఆడిన క్రికెటర్లు ఈ పోస్టులకు అర్హులు.బీసీసీఐలో జాతీయ సెలక్టర్‌గా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న అభ్యర్థులు నిబంధనల ప్రకారం అర్హులు కాదు. ఐపీఎల్, ఇతర మేనేజ్‌మెంట్ సంస్థలతో పాటు ప్రపంచంలోని ఏ ఇతర లీగ్‌ల్లో భాగస్వామ్యం కాకూడదు. తదితర వివరాలతో కూడిన బయోడేటాను పూర్తి చేసి ఈనెల 14లోపు ముంబయిలోని బీసీసీఐ కార్యాలయ చిరునామాకు గాని, మెయిల్ మెయిల్ రూపంలో దరఖాస్తులను పంపవచ్చని పేర్కొంది.
No comments