కోహ్లీ డబుల్ సెంచరీ రికార్డు, రహానె మిస్: చివరలో రోహిత్, భారత్ 557

ఇండోర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు భారత్‌ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తొంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 211(271 బంతుల్లో 20×4) పరుగులు చేసి ఔటవగా, డబుల్ సెంచరీకి కొద్ది దూరంలో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అజింక్య రహానె 188(254 బంతుల్లో 18×4, 4×6) పరుగుల వద్ద వెనుదిరిగాడు.
కాగా, ఓవర్‌నైట్‌ స్కోరు 267/3తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ లంచ్‌ విరామానికి 358/3తో నిలిచింది.మొత్తంగా నాలుగో వికెట్‌కి విరాట్‌ కోహ్లీ-రహానె జోడి 365 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా, హెన్రీ విసిరిన ఓ బంతి రహానె హెల్మెట్‌కు బలంగా తాకడంతో కాసేపు భారత్‌ శిబిరంలో కంగారు మొదలైంది. అయితే ఈ సంఘటన అనంతరం రహానె బ్యాటింగ్‌లో దూకుడు పెంచాడు. 557 భారత్ డిక్లేర్ భారత్ 5 వికెట్లు కోల్పోయి 557 పరుగులకు తొలి ఇన్నింగ్ డిక్లేర్ ప్రకటించింది. కాగా, రోహిత్ శర్మ ధాటిగా ఆడి అర్ధ శతకం(63బంతుల్లో 51 పరుగులు, 3 ఫోర్లు, 2సిక్సర్లు) పూర్తి చేశాడు. జడేజా 27 బంతుల్పలో 17 పరుగులు చేశాడు. కివీస్ తొలి ఇన్నింగ్స్ ఓపెనర్లుగా వచ్చిన గుప్తిల్ 10, లాథమ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. కోహ్లీ డబుల్ సెంచరీ రికార్డు మూడో టెస్టులో కెప్టెన్‌ కోహ్లి డబుల్ సెంచరీ సాధించాడు. మొత్తం 347 బంతుల్లో కోహ్లి 18×4 సాయంతో 200 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటికే వెస్టిండీస్‌పై విరాట్‌ కోహ్లి ఓ డబుల్ సాధించాడు. భారత్‌ టెస్టు కెప్టెన్‌ రెండు ద్విశతకాలు చేయడం చరిత్రలో తొలిసారి. ఆ నలుగురి తర్వాత భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉంటూ అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్లలో ఇప్పటికే ధోనీని అధిగమించేసిన విరాట్ కోహ్లీ.. న్యూజిలాండ్ జట్టుపై తాజా సెంచరీతో టైగర్ పటౌడీని దాటేశాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా ఉన్నాడు. కెప్టెన్‌గా ఆరు సెంచరీలు చేసిన కోహ్లీకన్నా ముందు ముగ్గురు మాత్రమే ఉండగా.. వీరిని అధిగమించి, తన పేరిట అరుదైన రికార్డు నెలకొల్పేందుకు కోహ్లీకి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. కాగా, భారత జట్టు కెప్టెన్లుగా ఉండి సెంచరీలు సాధించిన వారిలో గవాస్కర్ (11) అగ్రస్థానంలో ఉండగా, ఆపై అజారుద్దీన్ (9), సచిన్ (7) శతకాలతో ఉన్నారు. కోహ్లీ మరో ఐదు సెంచరీలు చేస్తే, వీరందరి రికార్డులూ పటాపంచలవుతాయి.


No comments